ఎల్లారెడ్డి, డిసెంబర్ 29,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయం నుంచి పాద యాత్రగా శబరిమలకు వెళ్లి దర్శనం చేసుకుని వచ్చిన భూపాల్ స్వామి, శనివారం రాత్రి ఆర్మూర్ పట్టణంలో ఉంటున్న ఆయన తల్లి తండ్రులకు పాద పూజను ఘనంగా నిర్వహించి ఆశీర్వాదం తీసుకుని, మాలాధార స్వాములకు శాస్త (అల్పాహారం) ఏర్పాటు చేసినట్లు భూపాల్ స్వామి తెలిపారు. శబరిమల కొండకు పాదయాత్రగా వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వచ్చి, తన తల్లిదండ్రులకు పాదపూజ చేసుకొని ఆశీర్వాదం తీసుకోవడం పూర్వజన్మ సుకృతం అని తల్లితండ్రుల ఆశీర్వాదం ఎప్పటికీ ఇలానే ఉండాలని ఆకాంక్షించారు.
