Home తాజా వార్తలు ఇరుముడి కట్టి శబరిమలకు …వాహనంలో తరలిన మాలధార స్వాములు….

ఇరుముడి కట్టి శబరిమలకు …వాహనంలో తరలిన మాలధార స్వాములు….

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 29,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో, ఆదివారం ఉదయం అయ్యప్ప మాలాధారణ చేసిన ఐదుగురు స్వాములు 41 రోజుల దీక్ష పూర్తి చేసుకుని, గురుస్వామి దేశబోయిన సాయిలు స్వామిచే, ఆలయ పూజారి శ్రీనివాస్ రావు సమక్షంలో ఇరుముడి కట్టుకుని నెత్తిన పెట్టుకొని, పదునెట్టంబడి పడిని వెలిగించి, ఆలయంలో స్వామివారికి ప్రదక్షణలు చేసి, వాహనంలో శబరిమలకు బయలు దేరి వెళ్ళారు. స్వాములకు కుటుంబ సభ్యులు, మలాధార స్వాములు ఘనంగా వీడ్కోలు పలికారు. శబరిమలకు తరలిన వారిలో తరుణ్ స్వామి, గోవింద్ స్వామి, సాయిలు స్వామి, మోహన్ స్వామి, వెంకట్ స్వామి లు తరలి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో నవీన్ స్వామి, సందీప్ స్వామి, తదితర మాలధార స్వాములతో పాటు ఆలయ కమిటి ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, స్వాముల కుటుంబ సభ్యులు , తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment