నర్వ మండల్/ డిసెంబర్ 29 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్) నర్వ మండల పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరా
తేది 29-12-2024 సాయంత్రం 6:00 గంటల నుండీ 31-12-2024 సాయంత్రం 6:00గంటల వరకు మొత్తం 48 గంటలు నీటి సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని పత్రికా ప్రకటన ద్వారా నర్వ గ్రామ పంచాయతీ సెక్రెటరీ బుచ్చిరెడ్డి తెలిపారు.ఎందుకు అనగా మరికల్ నుండి నారాయణపేట పోయే దారిలో పెట్రోల్ బంక్ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ రెండు ప్రదేశాలలో లీకేజీ అవుతున్నదునా లీకేజీ పైపులు తీసి కొత్త పైపులు అమర్చటానికి నీటి సరపరా నిలిపివేయడం జరుగుతుంది. ఇట్టి పని పూర్తి కావడానికి సుమారు 48 గంటలు నీటి సరపరా ఆపివేయడం జరుగుతుంది. దీనివలన మన్యంకొండ నీటి శుద్ధి కేంద్రం నుండి నీటి సరపరా అయ్యే మరియు , నర్వ, మండల గ్రామాలకు పూర్తిగా పాక్షికంగా, నీటిని నిలిపివేయడం జరుగుతుందని కావున నర్వ మండల తెలియజేశారు.
నర్వ మండల పరిధిలో గ్రామాలకు రెండు రోజులు నీటి సరఫరా బంద్.
49