బిచ్కుంద డిసెంబర్ 27 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం నాడు ఎంపీడీవో కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో బిచ్కుంద మండలంలోని వివిధ గ్రామపంచాయతీ కార్మికులందరూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా టోకెన్ సమ్మె నిర్వహించడం జరిగింది.
జిపి కార్మికుల సమ్మె కు మద్దతుగా సిఐటియు. జిల్లా కమిటీ సభ్యులు. సురేష్ గొండ పాల్గొనిమాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం. గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని జిపి కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని. పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని. ప్రతినెల ఒకటవ తేదీ నాడు. వేతనాలు నేరుగా కార్మికుల అకౌంట్లో పడాలని. పిఎఫ్. ఈఎస్ఐ. సౌకర్యాలు కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సురేష్ గొండ డిమాండ్ చేశారు. కార్మికులందరూ తమ డిమాండ్ల పరిష్కారం అయ్యేంతవరకు ఐక్యంతో ఉండి డిమాండ్లు సాధించుకోవాలని జిపి కార్మికులందరికీ ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో. జిపి కార్మికుల మండల అధ్యక్షులు. రూప్ సింగ్ మండల కార్యదర్శి. సిహెచ్.సాయిలు.బిచ్కుంద. టౌన్. అధ్యక్షులు. భూమయ్య. కార్మికులు. సాయిలు. లక్ష్మణ్. గంగవ్వ. చంద్రవ్వ. శకుంతల. గిన్నే బాయ్. సరూప. మండలంలోనివివిధ గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు

