Home తాజా వార్తలు సంత్సంగాలు….- తెలంగాణ ప్రాంత గోరక్ష ప్రముఖ్ ఇల్లంపల్లె వెంకన్న

సంత్సంగాలు….- తెలంగాణ ప్రాంత గోరక్ష ప్రముఖ్ ఇల్లంపల్లె వెంకన్న

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 25,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

హైందవ ధర్మ రక్షణ కోసం ప్రతి గ్రామంలో సత్సంగాలు చేసి ప్రజలను చైతన్య వంతులను చేయాలని, తెలంగాణ ప్రాంత గొరక్ష ప్రముఖ్ ఇల్లంపల్లె వెంకన్న సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక వంగపల్లి ఫంక్షన్ హాల్లో ఈ నెల 24, 25 రెండు రోజుల పాటు జిల్లాలో ఉన్న విశ్వహిందూ పరిషత్ కార్యకార్తలను సుక్షితులుగా తయారు చెయుటకు కామారెడ్డి జిల్లా ప్రశిక్షణ వర్గ అధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. బుధవారం చివరి రోజు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకన్న మాట్లాడుతూ…వి హెచ్ పి కార్యకర్తలకు సంస్థపై అవగాహన పెంచడంతో పాటు, హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి గ్రామంలో సత్సంగాలు, హనుమాన్ చాలీసా పఠనం, నూతన విశ్వహిందూ పరిషత్ కమిటీలు, సేవా కార్యక్రమాలు చేయాలని ప్రాంత సూచన మేరకు, జిల్లాలో విశ్వహిందు పరిషత్ రెండు రోజుల జిల్లా ప్రశిక్షన వర్గ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వర్గ లో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి కార్యకర్తలు పాల్గొనడం జరిగిందని తెలిపారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా తరపున పూర్వ విశ్వహిందూ పరిషత్ ఇందూర్ ఉపాధ్యక్షులుగా పనిచేసిన వంగపల్లి నాగభూషణం కు సన్మానం చేశారు. ఈ ప్రశిక్షన వర్గ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత గోరక్ష విభాగ కార్యదర్శి తమ్మల కృష్ణన్న , జిల్లా అధ్యక్షులు ఆధారపు నిత్యానందం, ఉపాధ్యక్షులు గంగారెడ్డి, విశేష సంపర్క ప్రముక్ గోపాలకృష్ణ, జిల్లా కార్యదర్శి బొల్లి రాజు, తులసీదాస్, వినోద్ , నవీన్ చారి, ప్రఖండ స్థాయి, గ్రామ స్థాయి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment