Home తాజా వార్తలు ఎల్లారెడ్డి లో ఘనంగా అయ్యప్ప పడిపూజ….

ఎల్లారెడ్డి లో ఘనంగా అయ్యప్ప పడిపూజ….

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 25,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణంలో , మంగళవారం రాత్రి తరుణ్ స్వామి అద్వర్యంలో ఆయన సన్నిధానంలో ఉన్న అయ్యప్ప మాలదార స్వాములు సాయి స్వామి , వెంకట్ స్వామి, మోహన్ స్వామి, గోవింద్ స్వామి అయ్యప్ప పడి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రణయ్ జోషి పంతులు తరుణ్ స్వామిచే పడి పూజను శాస్త్రోక్తంగా చేయించారు. స్వామి వారి దివ్య మంగళ విగ్రహానికి పది రకాల అభిషేకాలు చేయించి, పదునెట్టంబడి 18 మెట్లకు పడి పూజలు చేసి, పడి పై కర్పూర జ్యోతులు వెలిగింపజేసి మంగళ హారతులతో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. స్వామి వారికి అభిషేకాలు చేస్తున్న సమయంలో అయ్యప్ప స్వాముల భజన పాటలతో ఆ ప్రాంతం మార్మోగింది. అనంతరం అయ్యప్ప మాలాధార స్వాములకు శాస్త (అల్పాహారం) ఏర్పాటు చేశారు. పడి పూజ కార్యక్రమానికి హన్మంతప్ప గురుస్వామి, ఓర భీమన్న గురు స్వామి, రాజేందర్ నాథ్ గురుస్వామి తో పాటు ఎల్లారెడ్డి, నాగిరెడ్డి పేట్, లింగం పేట్ మండలాల నుంచి, చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి మాలాధార స్వాములు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాధార స్వాములు అర్జున్ గౌడ్ స్వామి, అరుణ్ స్వామి, డాక్టర్ ఉపేందర్ స్వామి, కన్నె స్వామి కిషన్, విజయ్ కన్నె స్వామి, అయ్యప్ప స్వాముల కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment