Home తాజా వార్తలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

by Telangana Express

బిచ్కుంద డిసెంబర్ 24 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

                                   కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బిచ్కుంద మరియు మద్నూర్ కళాశాలలో  అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కే .అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. బిచ్కుంద డిగ్రీ కళాశాలలో ఆంగ్లం-1 మరియు అర్థశాస్త్రం-1 ఖాళీలు కలవు .మద్నూర్ డిగ్రీ కళాశాలలో 

తెలుగు -1, ఆంగ్లం-1, బాటని-1, జువాలజీ-1, కెమిస్ట్రీ-1 ఖాళీలు కలవు. సంబంధిత సబ్జెక్టు పీజీలో 55% మార్కులు అర్హత కలిగి ఉండాలి. నెట్,సెట్,పీహెచ్డీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును. విద్య అర్హత పత్రాలు ఈనెల 27వ తారీకు అనగా శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలలోపు బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమర్పించగలరు.

You may also like

Leave a Comment