Home తాజా వార్తలు అమిత్ షా వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే వరకు నిరసనలు తెలుపుతాం….దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ….

అమిత్ షా వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే వరకు నిరసనలు తెలుపుతాం….దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ….

by Telangana Express
      - ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ 

ఎల్లారెడ్డి, డిసెంబర్ 24,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):

భారత పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమీత్ షా వెనక్కి తీసుకునే వరకు నిరసనలు తెలుపుతామని , ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పష్టం చేశారు. మంగళవారం ఏఐసీసీ పిలుపు మేరకు ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఫ్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ… అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా వెంటనే జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద భారత రాజ్యాంగాన్ని రూపొందించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ పట్ల పార్లమెంట్ సాక్షిగా హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశాడని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అణగారిన వర్గాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. అమిత్ షా వ్యాఖ్యలను తమ నాయకుడు రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్లో ఖండించారని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం బిజెపి సర్కార్ అమీషాపై చర్యలు తీసుకొని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా పనిచేసిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మారెడ్డి రజిత, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగం గోపికృష్ణ, గాంధారి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేష్, ఎన్ఎస్ యుఐ మండల అధ్యక్షులు నాగం శ్రీనివాస్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment