Home తాజా వార్తలు క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన ఎల్లారెడ్డి సిఎస్ఐ, ఎద వర్షిప్ చర్చ్ లు…

క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన ఎల్లారెడ్డి సిఎస్ఐ, ఎద వర్షిప్ చర్చ్ లు…

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 24,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

లోక రక్షకుడు ఏసుక్రీస్తు జన్మ దినం సందర్భంగా , బుధవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకలను జరుపు కోనున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని సీఎస్ఐ చర్చ్ తో పాటు మున్సిపాలిటీ పరిధిలోని 4 వ వార్డు కింద గల బాలాజీ నగర్ తాండా సమీపంలో గల ఏద వర్షిప్ చర్చిలను నిర్వాహకులు విద్యుత్ సీరియల్ దీపాలతో సుందరంగా అలంకరించారు. రాత్రి వేళలో విద్యుత్ సీరియల్ లైట్ల కాంతులతో చర్చ్ లు దేదీప్యమానంగా వెలుగుతూ నూతన హంగులు సంతరిం చుకున్నాయి. బుధవారం ఉదయం నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభ మవుతాయని, సీఎస్ఐ చర్చి ప్రెస్బైటర్ ఇంచార్జి ఎర్రోళ్ల ప్రభాకర్, ఏద వర్షిప్ చర్చి నిర్వాహకులు బ్రదర్ శ్రీనివాస్ చారి, సిస్టర్ హెప్సిబా చారి లు తెలిపారు. క్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక భజనలు, ప్రార్థనలు, క్రిస్మస్ కేక్ కట్ చేసిన అనంతరం కానుకల సమర్పణ, తదితర కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవ సోదరులు భారీ సంఖ్యలో హాజరై క్రీస్తు కృపకు పాత్రులు కావాలని కోరారు.

You may also like

Leave a Comment