ముధోల్:24డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని హ నుమాన్ ఆలయం నుండి గాంధీ చౌక్ వరకు సీసీ రోడ్డు పనులను మంగళవా రం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రావుల గం గారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల అభివృద్ధికి ప్రభు త్వం ప్రత్యేక దృష్టిని తీసుకుంటుంద న్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుం డి రూ.40 లక్షలతో సీసీరోడ్డు పనుల ను చేపట్టినట్లు పేర్కొన్నారు. నియోజ కవర్గ కేంద్రంలో గ్రామీణ రోడ్ల అభివృద్ధి కి కృషి చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, ని యోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ భో స్లే నారాయణరావు పటేల్ కు ధన్య వాదాలు తెలిపారు. సీసీ రోడ్ల నిధులు మంజూరుకు కృషి చేసిన సీఎం రేవం త్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ సురేందర్, నాయకులు పతంగి కిషన్, రావుల శ్రీనివాస్,అజీజ్, జమీల్, పల్లె నాగేష్, గోవింద్ పటేల్, బాబాయ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నజీమ్ హైమద్ తోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులున్నారు
