- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా
ఎల్లారెడ్డి, డిసెంబర్ 23, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల రాజ్యసభలో అమీత్ షా చేసిన వాఖ్యలకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు, స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా సోమవారం తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మెహన్ పాల్గొనడం జరుగుతుందని. ఎల్లారెడ్డి మండలంలోని మాజీ జడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరారు.
