Home తాజా వార్తలు బహుమతి పొందిన విద్యార్థులను అభినందించిన డీఈవో రామారావు

బహుమతి పొందిన విద్యార్థులను అభినందించిన డీఈవో రామారావు

by Telangana Express

లోకేశ్వరం డిసెంబర్ 23
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో సోమవారం నిర్వహించిన వెస్ట్ టూ వెల్త్ అనే ప్రాజెక్టు అంశం జిల్లాలోని 30 జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ పేపర్, ప్లాస్టిక్ బాటిల్స్ రీ సైకిల్ చేయడం వీలుకాదు. వీటిని పర్నిచర్ లో గాని కన్స్ట్రక్షన్ లో గాని, జెడ్స్ తయారీ చేయడంలో గాని ఏ విధంగా ఉపయోగించాలో చేసి చూపించడం జరిగింది.ఈ ప్రాజెక్టును పరిశీలించిన డీఈవో రామారావు, ఎన్జీసీ కోఆర్డినేటర్ మోహన్ రావు,లోకేశ్వరం మండలం లోని రాజుర గ్రామం విద్యార్థులను మరియు గైడ్ టీచర్ ను అభినందించారు.ఇందులో మొదటి బహుమతి జెడ్పిహెచ్ఎస్ వడ్యాల్ రెండవ బహుమతి గౌట్ హైస్కూల్ ఈద్గాం మరియు మూడవ బహుమతి జెడిఎస్ఎస్ రాజుర విద్యార్థులు పొందడం జరిగింది. ఈ ప్రాజెక్టు తయారు చేయడంలో పదవ తరగతి విద్యార్థులు యశస్విని, మీనా, గైడ్ టీచర్ గా బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ జి చంద్రశేఖర్, పాల్గొనడం జరిగింది. వీరిని జెడిఎస్ఎస్ రాజుర ప్రధానోపాధ్యాయులు రేగుంట రాజేశ్వర్, ఉపాధ్యాయులు గ్రామస్తులు,పాల్గున్నారు

You may also like

Leave a Comment