..మండల అధ్యక్షులు కోరి పోతన్న
ముధోల్:23డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
రాబోయే సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని బీజే పీ మండల అధ్యక్షులు కోరి పోతన్న అ న్నారు. సోమవారం మండలంలోని బ్రహ్మణగావ్ గ్రామంలో 245 పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్ష, కార్యదర్శుల ను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రా జుల పెద్దరాజు, కార్యదర్శిగా ఎడ్ల సతీ ష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావే శంలో మండల అధ్యక్షులు మాట్లాడు తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో భాజ పా అభ్యర్థులదే గెలుపు దిశగా పనిచే యాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభు త్వ పథకాలను మోదీ నాయకత్వం గురించి తెలియజేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడుతున్న ఎమ్మెల్యే పవార్ రామారా వు పటేల్ కృషిని ప్రతి గ్రామంలో తెలి యజేసే విధంగా కార్యకర్తలు పనిచే యాలని పేర్కొన్నారు ఈ కార్యక్ర మంలో మాజీ సర్పంచ్ లాల్ గారి గంగాధర్, సీనియర్ నాయకులు సతీష్ రెడ్డి, కిష్టారెడ్డి, గంగాధర్ స్వామి, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ సుమన్ కుమార్ తో పాటు తదితరులున్నారు.
