అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు….
ఆకట్టుకున్న క్రీస్తు జన్మ వృత్తాంతం దృశ్య రూపకం…
ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్….
ఎల్లారెడ్డి, డిసెంబర్ 23, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక జీవధాన్ హై స్కూల్ లో, సోమవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. లోక రక్షకుడు ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరిం చుకుని ప్రపంచ వ్యాప్తంగా బుధవారం క్రిస్మస్ వేడుకలను జరుపుకోనున్నారు. విద్యార్థులకు క్రిస్మస్ సెలవులు ఉండటంతో ముందస్తుగానే పాఠశాలలో విద్యార్థులతో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ , కౌన్సిలర్ నీలకంఠం , కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు కురుమ సాయిబాబా లు, పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ జోభిష్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. క్రిస్మస్ కేక్ కట్ చేసిన అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆతర్వాత పాఠశాల యాజమాన్యం అతిథులకు శాలువా కప్పి మెమోంటోలతో సత్కరించారు. పిదప విద్యార్థులకు క్రీస్తు సందేశం వినిపించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, చిన్నారి విద్యార్థుల నృత్యాలు అందరిని అలరించాయి, విద్యార్థులు యెహోవా జన్మ వృత్తాంతంను కళ్ళకు కట్టినట్లు గా ప్రదర్శించిన దృశ్య రూపకం అందరిని ఆకట్టుకుంది. ఏసు క్రీస్తును స్తుతిస్తూ విద్యార్థుల బృందం పాడిన పాటలు ఉర్రూతలూగించాయి. శాంటా క్లాజ్ విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఫాదర్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ జోభిష్ , సీనియర్ ఉపాద్యాయులు షాదుల్ల, ఉపాద్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

