Home తాజా వార్తలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధితులకు సెల్ఫోన్ల అందజేత

జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధితులకు సెల్ఫోన్ల అందజేత

by Telangana Express

నారాయణపేట జిల్లా, ప్రతినిధి, డిసెంబర్ 23 (తెలంగాణ ఎక్స్ ప్రెస్): గత రెండు నెలలుగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి ఫోన్లను పోలీస్ యంత్రాంగం కనిపెట్టి వాటిని స్వాధీనం చేసుకుని సోమవారం నాడు బాధితులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేసిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్. పోగొట్టుకున్న 70 ఫోన్ల విలువ 10 లక్షల 50 వేల రూపాయలుగా అంచనా వేశారు. ప్రజలు ఎవరు కూడా పాత సెల్ ఫోన్లు కొనకూడదని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఇకపై ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. ఇట్టి ఫోన్లను నూతన టెక్నాలజీ ఐటి కోర్ నుండి ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. ఫోన్లు అందుకున్న బాధితులు సంతోషం వ్యక్తం చేశారని తెలియజేశారు.

You may also like

Leave a Comment