బాన్సువాడ మండల్ డిసెంబర్22
తెలంగాణ ఎక్స్ ప్రెస్
నేడు గణిత దినోత్సవ సందర్భంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన గణిత ప్రతిభా పరీక్ష ఫలితాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బోర్లం పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థి చిరంజీవి జాహేద్ రాష్ట్రస్థాయిలో 2 ప్లేస్ (రెండవ స్థానం) పొందినందుకుగాను చిరంజీవి జాహీద్ కి హృదయపూర్వక శుభాశీస్సులు మరియు చిరంజీవి జాహేద్ ను రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలిచేటట్లుగా నిరంతరం కృషిచేసి గణితంలో మెలుకువలు నేర్పించి తర్ఫీదునిచ్చిన గణిత ఉపాధ్యాయులు శ్రీ పద్మ శ్రీనివాస్ కి హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు.మారుమూల గ్రామమైన బోర్లం పాఠశాల నుండి నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి జాహేద్ రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి సాధించడం గర్వకారణం. విద్యార్థిని ప్రోత్సహించిన గణిత ఉపాధ్యాయులు పద్మ శ్రీనివాస్ కి కృతజ్ఞతలు. వీరిని వెన్నంటి ప్రోత్సహించిన పాఠశాల రథసారథి, ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ సార్ కి ప్రత్యేక అభినందనలు. తెలిపారు

