*బూత్ స్థాయి అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపుకై కృషి చేయాలి జిల్లా కార్యదర్శి నల్ల రమేష్*
లోకేశ్వరం డిసెంబర్ 22
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
లోకేశ్వరం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయినా గడ్చందా గ్రామంలోని పోలింగ్ బూత్ నంబర్ 192 &193 యొక్క సమావేశం ఏర్పరిచి పోలింగ్ బూత్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
పోలింగ్ బూత్ నెం 192 వ అధ్యక్షుడిగా సిబిడి శ్రీనివాస్ కార్యదర్శిగా అంబకంటి రాకేష్,
పోలింగ్ బూత్ నెం 193 వ అధ్యక్షుడిగా ఓడ్నం రాజు, కార్యదర్శిగా అల్లం నరేష్,ను నియమించడం జరిగింది.
అలాగే బామ్ని కె గ్రామం యొక్క కార్యకర్తల సమావేశం ఏర్పరిచి పోలింగ్ బూత్ అధ్యక్షుడుగా నూతి కాడి రమణ,కార్యదర్శిగా చట్టే సుమన్,ను ఎన్నుకోవడం జరిగింది అనంతరం పోలింగ్ బూత్ అధ్యక్ష కార్యదర్శులు పార్టీ పటిష్టత కోసం పనిచేసే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ప్రణాళికలు చేపట్టి నరేంద్ర మోడీ, యొక్క నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల యొక్క ఇంటింటికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే రామారావు పటేల్, యొక్క అభివృద్ధి కార్యక్రమాలను అందరికీ చేరవేయాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్రియాశీల సభ్యత్వ ఇన్చార్జి జిల్లా కార్యదర్శి నల్ల రమేష్, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ సుమన్ కుమార్, మండల ఓబీసీ మోర్చా కార్యదర్శి మురళి, స్థానిక మాజీ ఎంపీటీసీ జీవన్, ప్రదీప్ రావు, మండల ఉపాధ్యక్షుడు సీనియర్ కార్యకర్త దేవేందర్ కిసాన్, మోర్చా నాయకులు సాయన్న, ఓనేష్,నరేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


