తుంగతుర్తి (తెలంగాణ ఎక్స్ ప్రెస్) డిసెంబర్22 నల్లగొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశానుసారం నల్గొండ జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సంతోష్, సూర్యాపేట జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ లక్ష్మానాయక్ ఆధ్వర్యంలో ఈరోజు తెల్లవారుజామున సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మండలం వెలిశాల x రోడ్ గ్రామ శివారులో తుంగతుర్తి ఎక్సైజ్ పోలీసులు సూర్యాపేట జిల్లా టాస్క్ ఫోర్సు బృందంతో కలిసి సంయుక్తంగా వాహనాల తనిఖీ నిర్వహించినారు.
ఈ తనిఖీలలో భాగంగా 30 వేల కిలాల నల్ల బెల్లం, 100 కేజీల పట్టిక, 20 లీటర్ల సారాయి MH26CH0075 నెంబర్ గల లారీ వాహనాన్ని స్వాధీన పరుచుకున్నారు. అట్టి లారీ లో ఉన్న గంగారం అనే ఒక వ్యక్తిని అరెస్టు చేసినారు.
ఏ2, ఏ3, లైన తమన వినీత్ , షైక్ ఫరూక్ పరారీలో ఉన్నట్లుగా తుంగతుర్తి ఎక్సైజ్ సీఐ రజిత తెలిపినారు.
ఈ దాడులలో టాస్క్ ఫోర్సు సీఐ మల్లయ్య , ఎక్సైజ్ ఎస్సైలు మూర్తి , రామకృష్ణ మరియు కానిస్టేబుల్ లు ఆంజనేయులు , కొండల్, ఇబ్రహీం,శ్రీకాంత్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
