Home తాజా వార్తలు నల్గొండ జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్*

నల్గొండ జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్*

by Telangana Express

*హాజరైన కర్నాటి రమేష్ డైమండ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు*

మిర్యాలగూడ డిసెంబర్ 22 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

డైమండ్ చెస్ అకాడమీస్
అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి మాశెట్టి దివ్యశ్రీ నేతృత్వంలో ఆదివారం ఐఎంఏ భవనంలో నిర్వహిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, నిర్వాహకులు లయన్స్ క్లబ్ మీల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రాం చైర్మన్ డైమండ్ శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి తో కలిసి చదరంగం పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 80 మంది క్రీడాకారులు పోటీలలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ చదరంగం పోటీతో మేదో వికాసానికి పదును పెడుతుందన్నారు. పెరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మాశెట్టి గీత (డైమండ్) అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి అంకిత గౌడ్, అరవింద్, లక్ష్మీ ప్రియ, కౌన్సిలర్ రామకృష్ణ, కాంగ్రెస్ నేత సాగ జలంధర్ రెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్, ఎస్.వి. మోడల్ హైస్కూల్ ప్రిన్సిపాల్ ఓరుగంటి శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment