*సమ్మె కారణంగా పనులో ఆటంకాలు వారి సమ్మె ముగిసేది ఎప్పుడు కార్యాలయం పున ప్రారంభించేది ఇప్పుడు….*
*జిల్లా సిసిఓ అధ్యక్షులు భోజన్న*
లోకేశ్వరం డిసెంబర్21
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
లోకేశ్వరం మండల కేంద్రంలోని
ఎమ్మార్సీ కార్యాలయం గత 12 రోజుల నుండి తాళంతో దర్శనమిస్తుంది సమ్మెలో భాగంగా ఉద్యోగులు కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లగా గత 12 రోజుల నుండి ఎంఆర్సి కార్యాలయాల్లో సమ్మె కారణంగా పనులు ముందుకు సగడం లేదు.అని నిర్మల్ జిల్లా సిసిఓ అధ్యక్షులు భోజన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విద్యాశాఖలో కీలకమైన యుడైస్ పనులు, మధ్యాహ్న భోజనం కార్మికుల రెండు కోట్ల బిల్లులు నిలిచిపోయాయి అని
విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అపార్ ఐడి జనరేషన్ పనులు నిలిచిపోయాయని అన్నారు
విద్యాశాఖకు కీలకమైన బడి బయట పిల్లల సర్వే సి అర్పిలు ఎంఆర్సి సిబ్బంది సమ్మెలో ఉండడం వల్ల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు వివిధ పనుల కొరకు ఎం ఆర్ సి కి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు అని
ఎమ్మార్సీ సిబ్బంది సమ్మె కారణంగా పాఠశాల స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి వెళ్లాల్సిన అన్ని రిపోర్ట్స్ నిలిచిపోయాయిఅని అన్నారు
ఈ సమ్మె ఇదే విధంగా కొనసాగితే విద్యార్థుల వార్షిక ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉంది తెలియజేశారు.
పిఎఫ్ ఎంఎస్ లో పాఠశాల నిర్వహణ సంబంధించిన బిల్లులు నిలిచిపోయాయి మరియు
పాఠశాల విద్యార్థులకు అల్పాహారo అందించే రాగిజావ బెల్లం పంపిణీ నిలిచిపోయింది
రాబోయే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అందజేయాల్సిన పుస్తకాలు,స్కూల్ యూనిఫామ్ ఇండెంట్ సేకరించి జిల్లా మరియు రాష్ట్ర కార్యాలయానికి పంపించే పనులు నిలిచిపోయాయి అన్నారు
ఉపాధ్యాయుల క్యాడర్ స్ట్రెంత్ కన్ఫర్మేషన్ సంబంధించిన పనులు నిలిచిపోయాయి.
మధ్యాహ్న భోజనం సంబంధించి పాఠశాలలకు పంపించాల్సిన బియ్యం సరఫరా పనులు నిలిచిపోయాయి తెలియజేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ ఏకశీల పార్కు వద్ద ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ సమగ్ర శిక్షలోని ఉద్యోగులను క్రమబద్దీకరించాలి.
దీనికై ఒక ప్రత్యేక మైన గైడ్ లైన్స్ ఇవ్వాలి.అలాగే ఎం ఆర్ సి లల్లో ఒక్క రెగ్యులర్ ఉద్యోగి లేని చెత
రెగ్యులర్ పోస్ట్ క్రియేట్ చెసీ అందులో విలీనం చేయాలి.
అప్పటి వరకు హెచ్ఆర్ పాలసీతో కూడిన పే స్కేల్ ఇవ్వాలి అన్నారు.అంతేకాకుండా
హెల్త్ కార్డులు ఇవ్వాలి.
ప్రమాద భీమా 10లక్షలు ఇవ్వాలి.ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఇవ్వాలి అని
ప్రభుత్వ పరీక్షలల్లో వెయిటేజ్
ఇవ్వాలి అన్నారు,

