ముధోల్:21డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సంద ర్భంగా మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్ర ఉన్నత పాఠశాలలో శనివారం ఘనం గా గణిత దినోత్సవ వేడుకల ను నిర్వహించారు. ఈ సంద ర్భంగా గణిత ప్రదర్శన కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా మం డల విద్యాధికారి రమణారెడ్డి హాజరయ్యారు. దీంతో పాఠశా లలో విద్యార్థిని, విద్యార్థులు నిర్వహించిన గణిత ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుం ది. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. బ్రిటిష్ కాలంలో భార తదేశానికి చెందిన గణిత శాస్త్ర వేత్త రామానుజం అని గుర్తు చేశారు. 20వ శతాబ్దంలోని గ ణిత పితామహులలో శ్రీనివాస రామానుజం ఒకరు అని అన్నా రు. అటువంటి గణిత మేధావి జయంతి సందర్భంగా విద్యా ర్థులు ప్రదర్శించిన గణిత ప్రదర్శన ఎంతో ఉపయోగక రమన్నారు.భారతదేశ ఖ్యాతి ని ప్రపంచ దేశాలకు చాటిన గొప్ప గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ అని తెలియజేశా రు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అసంవార్ సాయినా థ్,కరె స్పాండెంట్ రాజేందర్, చై ర్మన్ భీంరావ్ దేశాయి డైరెక్ట ర్ పోత న్న యాదవ్, ఉపాధ్యా యు లు,విద్యార్థులు, తదితరు లు పాల్గోన్నారు.
