ముధోల్:డిసెంబర్21(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు లబ్ధిదారులు సహకరించాలని గ్రామపంచాయతీ ఈవో ప్రసాద్ గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన ముధోల్ లోని ఆయా కాలనీలో సర్వే వివరాలు లబ్ధిదారుల వద్ద నుండి అడిగి తెలుసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక యాప్ లో అన్ని వివరాలను నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు లబ్ధిదారులు ఇంటి వద్దనే ఉండి ఎలాంటి తప్పులు లేకుండా వివరాలను తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి ఇందిరమ్మ సర్వే వివరాలకు సహకరించాలని కోరారు.
