*రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చెయ్యాలి మాజీ సర్పంచ్ మెండే శ్రీధర్*
లోకేశ్వరం డిసెంబర్ 21
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల పర్వం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రాథమిక సభ్యత్వం ముగించుకొని లోకేశ్వరం రాజుర గ్రామంలోని మూడు పోలింగ్ బూతుల188,189,190 నెం గల పోలింగ్ బూత్ కమిటీలను ఎన్నుకొని బూత్ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు గా ఈ క్రింది వారిని నియమించడం జరిగింది
పోలింగ్ నెం 188 అధ్యక్షులు గుండోల్ల నవీన్,కార్యదర్శిగా గోనె హరీష్, పోలింగ్ బూత్ నెం189 అధ్యక్షులు గా జడల రమేష్,కార్యదర్శిగా తోకల నవీన్,
పోలింగ్ బూత్ నెం190 అధ్యక్షులు గా ఐటి సాయన్న, కార్యదర్శిగా కమ్మరాశి దేవన్న,ను ఏకగ్రీవంగా ఎన్నుకొని బాధ్యతలను అప్పగించడం జరిగింది
పైన ఎన్నుకోబడిన బూతు అధ్యక్ష కార్యదర్శులు రాబోయే మూడు సంవత్సరాల వరకు గ్రామంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ నరేంద్ర మోడీ మార్గదర్శనంలో నేతృత్వంలో ప్రతి గ్రామలలో ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ పథకాలను మరియు ప్రియతమ ఎమ్మెల్యే రామారావు పటేల్ యొక్క అభివృద్ధి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లి పార్టీని పటిష్టం చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, కోరడం జరిగింది
భారతీయ జనతా పార్టీ సంస్థాగత నియమాలకు కట్టుబడి ఉండి నియమింపబడిన అధ్యక్ష కార్యదర్శులు పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ సుమన్, కుమార్ తెలియజేయడం జరిగింది
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధ్యక్షులు కార్యదర్శులు బూత్ కమిటీ సభ్యులు స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా పనిచేయాలని మాజీ సర్పంచ్ మెండే శ్రీధర్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ చిన్నారావు,అన్నారు
క్రియాశీల సభ్యత్వాలు మండలం యొక్క రిపోర్టును సంస్థాగత ఎన్నికల అర్హతను జిల్లా కార్యదర్శి క్రియాశీల సభ్యత్వ ఇంచార్జి నల్ల రమేష్, వివరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో సంస్థాగత మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి మహేందర్ రెడ్డి,ఓబీసీ మోర్చా మండల కార్యదర్శి వడ్నాల మురళి,రాజుర మాజీ ఎంపీటీసీ పోతన్న, ఉప సర్పంచ్ ప్రవీణ్, కుంట రాజు,పోలింగ్ బూత్ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

