Home తాజా వార్తలు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి…- ఆర్డీఓ మన్నె ప్రభాకర్

నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి…- ఆర్డీఓ మన్నె ప్రభాకర్

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 21 అన్,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్ సూచించారు. శనివారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బోజన ఏజన్సీ వారు నిలువ చేసిన బియ్యం, పప్పులు తదితర వాటిని పరిశీలించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న నాణ్యమైన భోజనాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో వండి అందించాలని సూచించారు. ఆతర్వాత ఆర్డీఓ మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా తిని రుచికరంగా ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మన్నె ప్రభాకర్, తహసిల్దార్ అల్లం మహేందర్ కుమార్, పాఠశాల హెచ్ ఎం. మాణిక్యం, ఉపాద్యాయులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment