. జోగిపేట డిసెంబర్ 21:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ను వెంటనే మార్చాలని, ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు అంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు శనివారం నాడు ఉదయం గురుకుల పాఠశాల ప్రధాన గేటు ముందు బైఠాయించి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సద్గుణ మేరీ గ్రేస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు నినాదాలు చేశారు, ఈ సంఘటన తెలుసుకున్న ఆందోల్ ఆర్ డి ఓ పాండు, తాసిల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తాసిల్దార్ మధుకర్ రెడ్డి, సీఐ అనిల్ కుమార్, అక్కడికి చేరుకొని నిరసన తెలుపుతున్న విద్యార్థులకు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు, విద్యార్థులు ఈ ప్రిన్సిపాల్ మాతో రోజు వెట్టి చాకిరి చేస్తున్నారు, ప్రిన్సిపాల్ ని వెంటనే ఇక్కడ నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు, ప్రిన్సిపాల్ మాతో కారు తుడిపించడం, వెట్టి చాకిరి చేయించడం, గ్రౌండ్లో ప్రతి ఒక్క పని కూడా పిల్లలతోనే చేయించడం చేస్తుందని తెలిపారు, ఇలాంటి వి ఎన్నో పనులు ప్రిన్సిపాల్ పిల్లలతోనే చేపిస్తున్నారు అని గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన చేశారు, మేము పనిచేయడానికి వచ్చామా లేక చదువుకోడానికి వచ్చామా అని విద్యార్థులు, ప్రిన్సిపాల్ ని వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు, సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు గేటు బయట నుంచి లోపలికి వెళ్లారు, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ తీరుపై విచారణ చేపట్టారు, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాలతో గురుకుల పాఠశాల కు చేరుకుని విద్యార్థులతో సమావేశం, నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు, విచారణ చేపట్టి ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గురుకుల విద్యార్థులకు హామీ ఇచ్చారు.
