Home తాజా వార్తలు అమిత్ షా ను మంత్రి పదవి నుండి భర్తరాఫ్ చేయాలి*

అమిత్ షా ను మంత్రి పదవి నుండి భర్తరాఫ్ చేయాలి*

by Telangana Express

*దళిత సంఘాల డిమాండ్*

బిచ్కుంద డిసెంబర్ 21 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షా వైఖరికి నిరసనగా బిచ్కుంద మండల కేంద్రంలో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటాలతో శుక్రవారం నిరసన ర్యాలీ మరియు అమిత్ షా దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా దళిత గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ దళిత, గిరిజన, అణగారిన వర్గాలు, వివక్షకు గురౌతున్న ప్రజలందరికీ న్యాయం జరగాలని, సామాజిక రాజకీయ ఆర్థిక సంస్కృతిక రంగాలలో జాతి నిర్మాణం కోసం పాటుపడిన అంబేద్కర్ గారిపట్ల వ్యంగ్యంగ కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడటం మంచిది కాదని అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెంటనే స్పందించి కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షా ను వెంటనే తొలగించాలని, అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని, అలాగే భారతీయ జనతాపార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు అంబేద్కర్ ను దైవంగా భావిస్తారని తమ బతుకులు మార్చిన మహనీయుడని , రాజ్యాంగం ద్వారా సర్వ హక్కులు కల్పించి సమానత్వం కోసం కృషి చేసిన అంబేద్కర్ ను దైవంగా భావిస్తారని అలాంటి మహనీయుని పట్ల అమిత్ షా చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బొగడ మీది సాయిలు, బుక్కవర్ రాంచందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్, ఎమ్మార్పీఎస్ నాయకులు మేత్రి హన్మాండ్లు, మరియు దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment