ఎస్. ఎం. పాషా ను సన్మానించిన మార్కెట్ కమిటీ చైర్మన్ మార్కెట్ ఛైర్మెన్ ఆనంద్ రావ్ పటేల్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ 21/12/24
భైంసా పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ ముహమ్మద్ పాష షఫీయా దంపతులకు కు నలుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు మీరంతా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమకం కావడం తో ఎస్. ఎం. పాషా ను మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ శాలువా తో సత్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఒక కుటుంబం లో ఆరుగురు టీచర్లు కావడం గర్వకారణం అన్నారు. ఇద్దరు దంపతులు ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తూ, పిల్లల్ని మంచి చదువులు చదివించి, వారిని ఉన్నత స్థానం లో ఉంచడం అభినందనీయమన్నారు. ఆరుగురు సంతానం లో మొదటి కూతురు హర్షియా ఇంద్రవెల్లి లో ఎస్. జి. టి. గా, రెండవ కూతురు సుమియా మామడ మండల కేంద్రం లో, మూడవ కూతురు సానియా పి. జి. టి. గా, చిన్న కూతురు రుబి నిర్మల్ లో ఎస్. జి. టి. గా, ఇద్దరు కొడుకులు అతిఫ్ ఓమెద్, ఫహద్ లు ముధోల్ మండలం లో ప్రభుత్వ ఉపాధ్యాయు లు గా విధులు నిర్వహిస్తున్నారు.. అందరు పిల్లలు టీచర్లు కావడంతో ఆ కుటుంబం లో సంతోషం నెలకొంది.. సన్మాన కార్యక్రమం లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తో పాటు పలువురు పాల్గొన్నారు..
ఓకే ఇంట్లో ఆరుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులే
40
previous post