ముధోల్:డిసెంబర్21(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ముధోల్ మండలంలోని ఎంపీపీఎస్ ,జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ఆహారోత్సవాన్ని(ఫుడ్ ఫెస్టివ ల్) శనివారం ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా మంచి పోషక విలువలు కలి గిన వివిధ ఆహార పదార్థాలను విద్యార్థులు తయారుచేసి ప్రదర్శించారు.తల్లిదండ్రుల సమావేశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్నినిర్వహించామని, విద్యార్థులకు పోషక విలువలు కలిగిన ఆహారంపై అవగాహన కల్పించామని ఎం ఈ ఓ రమణ రెడ్డి, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు సాయి రెడ్డి,తెలిపారు. ఈ కార్యక్ర మం లో ఉపాధ్యాయులు సునంద దేవి, గంగాధర్, వేణు గోపాల్ శ్రీనివాస్, నవీన్, దేవన్న, సురే ష్, రామ్ మోహన్,తల్లిదండ్రు లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
