Home తాజా వార్తలు 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 20,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు కురుమ సాయిబాబా తన స్వంత ఖర్చులతో తయారు చేయించిన, 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను, శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హైద్రాబాద్ లోని తన నివాస గృహంలో మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ …అందరికీ తెలిసే విధంగా సెలవులు, పండగల వివరాలతో కూడిన క్యాలెండర్ రూపొందించి, తనచే ఆవిష్కరించడం సంతోషంగా ఉందని క్యాలెండర్ తయారు చేయించిన సాయిబాబాకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాలెండర్ డిజైన్ బావుందంటూ ప్రశంసించారు. ఎల్లారెడ్డి మండలం నూతన సంవ‌త్స‌రంలో మరింత అభివృద్ధి సాధించి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆయ‌న‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వాసవి గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంతోష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగం గోపికృష్ణ, పట్టణ యూత్ అధ్యక్షులు సిద్దు, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు నాగం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరాం, చంద్రశేఖర్ , నాగేష్, మైపాల్ , సృజన్ గౌడ్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment