Home తాజా వార్తలు ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!

ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!

by Telangana Express

*స్థలాన్ని బట్టి నిర్మించుకునేలా అవకాశం*

*సింగిల్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌ల వారీగా డిజైన్లు..*

*నమూనాలను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం*

*ఇందిరమ్మ ఇంటి నమూనా నిర్మాణానికి శంకుస్థాపన

*

లోకేశ్వరం డిసెంబర్20
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

లోకేశ్వరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఇందిరమ్మ ఇల్లు మోడల్ నమూనా నిర్మాణానికి ఎంపీడీవో వెంకట రమేష్, హౌసింగ్ ఏఈ, ముగ్గు పోయడం జరిగిందని అన్నారు  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకంలో లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. ఇందిరమ్మ ఇంటికి సంబంధించి మూడు నమూనాలను ఖరారు చేసింది. పథకం కింద ఇల్లు మంజూరైన వారు తమ అభిరుచికి అనుగుణంగానే ఇంటిని నిర్మించుకోవచ్చని చెప్పినా.. స్థలాన్ని బట్టి ఏ విధంగా ఇంటిని నిర్మించుకోవాలనే దానిపై డిజైన్లను రూపొందించింది. ఇంటి నిర్మాణంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నమూనాలను విడుదల చేసింది. ఈ మూడింటిలో స్థలాన్ని బట్టి గదులను ఎలా నిర్మించుకోవాలనే వివరాలను పొందుపర్చింది అంతేకాకుండా ప్రతీ మండల కేంద్రంలోనూ ఒక ఇంటిని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. స్థలాన్ని బట్టి సింగిల్‌బెడ్‌ రూమ్‌, డబుల్‌ బెడ్‌ రూమ్‌, నిర్మించుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, ఈ పథకానికి రూపొందించిన విధివిధానాల మేరకు ఇంటిని నిర్మించుకునే వారికి రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందించనుంది. 400 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకున్న వారికి కూడా ఆర్ధిక సాయాన్ని అందిస్తుందని తెలిపారు కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ, మండల సర్వేయర్, ఆర్ఐ బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment