Home తాజా వార్తలు ఇసుక అనుమతి పై చర్చ….హాజరైన జిల్లా అధికారులు

ఇసుక అనుమతి పై చర్చ….హాజరైన జిల్లా అధికారులు

by Telangana Express

బిచ్కుంద డిసెంబర్ 20:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం
బిచ్కుంద మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఇసుక అనుమతి పై జిల్లా అధికారులు అసిస్టెంట్ కలెక్టర్,సబ్ కలెక్టర్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి, ఏడి మైండ్స్ అధికారి, రెవిన్యూ అధికారులు తదితరులు సమావేశమై జుక్కల్ నియోజకవర్గంలో ఇసుక యొక్క ఆవశ్యకతను మరియు ప్రజల నుంచి వచ్చిన,
ఇసుక కావాలని వినితులను వాటి గురించి చర్చించి ఇసుక ఎక్కడ లభ్యత ఉన్నదని చర్చించినారు. త్వరలోనే ఇసుక అనుమతి ఇవ్వాలని ఉన్నత అధికారులకు నివేదిక సమర్పిస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ విక్టర్,సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎడి మైన్స్ నాగేష్, డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ,తాసిల్దార్ సురేష్ మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment