* తహసిల్దార్ పి.దయానంద్
తుంగతుర్తి, డిసెంబర్ 20, ( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని తుంగతుర్తి తహసిల్దార్ ఈ దయానంద్ సూచించారు. మండల కేంద్రంలో ముక్కుడుదేవులపల్లి కి చెందిన ఇరుగు అశోక్ నూతనంగా ఏర్పాటు చేసిన దర్శన్ ఫ్యాషన్ మెన్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ… స్వయం ఉపాధితో ముందుకెళ్లాలనే ఆలోచన వచ్చి మెన్స్ వేర్ ను ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో వస్త్రా సంఘం మండల అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పెండెం శశిధర్, ప్రధాన కార్యదర్శి మధు, సంఘం సభ్యులు ఓరుగంటి అశోక్, బండారు దయాకర్, బుక్క ఉపేందర్, ఉస్మాన్,ఉమేష్ పాల్గొన్నారు.
