తుంగతుర్తి ( తెలంగాణ ఎక్స్ ప్రెస్) డిసెంబర్ 20
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి రాజ్యసభలో అవమానకరంగా అవహేళన మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాని *బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు తడకమళ్ళ రవికుమార్ అన్నారు* శుక్రవారం మండల కేంద్రంలోని విలేకరులతో మాట్లాడుతూ బే షరతుగా అంబేద్కర్ గారి పై చేసిన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలతో రాజ్యాంగంపై అంబేద్కర్ గారిపై బిజెపి విధానం ఏంటో అర్థమవుతుందని తెలిపారు. మతోన్మాద దళితుల వ్యతిరేక పార్టీ బిజెపి కాదని నిరూపించుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోడీకి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించి రాజ్యాంగ రూపకర్తను కించపరిచి మాట్లాడిన అమిత్ షాను పార్టీ నుండి తొలగించి, కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరాఫ్ చేయాలి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
