Home తాజా వార్తలు సీపీఐ శతజయంతి ఉత్సవా లను జయప్రదం చేయండి…సిపిఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి విలాస్

సీపీఐ శతజయంతి ఉత్సవా లను జయప్రదం చేయండి…సిపిఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి విలాస్

by Telangana Express

ముధోల్: 20డిసెంబర్(తెలంగా ణ ఎక్స్ ప్రెస్)

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీ ఐ)ఆవిర్భవించి ఈనెల 26 నాటికి 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్బం గా సీపీఐ నిర్మల్ జిల్లా సమితి పిలుపు మేరకు గ్రామాల్లో శత జయింతి ఉత్సవాలను ఘనం గా నిర్వహించాలని సీపీఐ నిర్మ ల్ జిల్లా కార్యదర్శి విలాస్ అ న్నారు. శుక్రవారం ముధోల్ మండల కేంద్రంలోని నయాబా దిలోని అంబెడ్కర్ చౌరస్తాలో సీపీఐ జెండాను ఎగురవేసి, ఆ యన మాట్లాడుతూ స్వాతం త్ర్యం అనంతరం సీపీఐ పార్టీ మనదేశంలో పేద బడుగు బ లహీన వర్గాలను చేరదీసి వారి అభ్యున్నతి కోసం కుల మత వర్గ తేడాలు లేని సమసమా జం కోసం పోరాడుతూ, సమా జంలో జమీందారులు జాగీర్దా రులు గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య పెద్దదారులు పేద లు, పేద రైతాంగంపై సాగిస్తున్న దౌర్జన్యాలపై కార్మికులు కష్టజీ వులకు శ్రమకు తగ్గ ఫలితం సాధించుటకు అందరిని ఐక్యం చేసి పోరాటాలు జరిపి విజ యం సాధించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదన్నారు. నీ బాంఛాన్దోర, నీ కాల్మొక్తా దొర అంటూ దొరల వద్ద జీత గాడి జీవితాన్ని అనుభవించిన బడుగు జీవులకు ధైర్యం చెప్పి బందూకులతో పోరాటాలకు సిద్దం చేసి 10 లక్షల ఎకరాల భూములను పేద కూలీలకు రైతాంగానికి పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ దన్నారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సహకార్యదర్శి ఎల్లా రూపాలి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కోండిబా, సీపీఐ నాయకులు శివాజీ, తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment