Home తాజా వార్తలు తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ.

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ.

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్. హైదరాబాద్,డిసెంబర్ 19

పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ను ప్రధాని మోడీ మంత్రి వర్గం నుండి భర్తరఫ్ చేయాలనీ తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థపాక,రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయం లో అయన విలేకరుల తో మాట్లాడారు. అమిత్ షా తన అగ్రకుల ఆధిపత్యాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రదర్శిస్తూ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దేశంలో ఉన్న దళిత, బహుజన సమాజాన్ని అవమానిoచడమే నన్నారు.భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసి మంత్రి పదవి ని స్వీకరించి అంబేద్కర్ ను విమర్శించడం అయన అవివేకానికి నిదర్శనం అన్నారు.అగ్రకుల, మనువాద భావజాలం ను పెంచి పోషించేలా అంబేద్కర్ ను టార్గెట్ చేసి మాట్లడడం అంటే ప్రజాస్వామ్యం ను అపహాస్యం చేసినట్లు భవిస్తున్నామని అన్నారు. అంబేద్కర్ స్పూర్తితో ముందుకెళ్తున్నాం అని చెపుతున్న ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి వర్గం నుండి అమిత్ షా ను బర్తర ఫ్ చేసి తమ చిత్త శుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటినుండి దేశ వ్యాప్తoగా దళితుల పై దాడులు పెరగడం తో పాటు రాజ్యాంగం పై కూడా విమర్శలు పెరిగాయని అన్నారు.రాజ్యాగం పరిరక్షణ కు దళితులు పెద్ద ఎత్తున ఉద్యమలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.అంబేద్కర్ ను, రాజ్యాంగం ను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన పదాలకు నమస్కరించాలని డిమాండ్ చేశారు. అయన వెంట రాష్ట్ర కార్యదర్శి సుక్క అశోక్ మాదిగ ఉన్నారు.

You may also like

Leave a Comment