ఎల్లారెడ్డి, డిసెంబర్ 17 అన్,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండలంలోని 31 గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల కేంద్రాల తుది జాబితాను, మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నోటీస్ బోర్డు పై ప్రదర్శించడం జరిగిందని, ఎంపీడీఓ అతి నారపు ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరుగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ల ఎన్నికల కోసం మండలంలోని అన్ని జీపిల కు కలిసి 264 పోలింగ్ కేంద్రాల తుది జాబితాను సిద్ధం చేసి, జీపీ నోటీస్ బోర్డు లపై, ఎంపీడీఓ కార్యాలయం నోటీస్ బోర్డు పై ప్రదర్శించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అతినారపు ప్రకాష్, జూనియర్ అసిస్టెంట్ మల్లయ్య, కంప్యూటర్ ఆపరేటర్ కపిల్ తదితరులు ఉన్నారు.
