Home తాజా వార్తలు రోడ్డు మరియూ డ్రైనేజ్ సమస్యలను వెంటనే పూర్తీ చేయాలని కసర గ్రామస్తులు కోరారు

రోడ్డు మరియూ డ్రైనేజ్ సమస్యలను వెంటనే పూర్తీ చేయాలని కసర గ్రామస్తులు కోరారు

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 17/12/24
భైంసా పట్టణం లోని తన నివాసంలో
కసార గ్రామస్తులు తమ సమస్యల గురించి శ్రీ భోస్లే నారాయణ్ రావు పటేల్ కి విన్నవించారు
కుబీర్ మండలం లోని కసర గ్రామస్తులు దాదాపు ఇరవై మంది తమ గ్రామంలో రోడ్డు డ్రైనేజీ మరియు రేషన్ కార్డు పింఛను తదితర సమస్యల గురించి శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ కి తెలియపరిచారు
మీ గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను కచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిధులను మంజూరు చేపించి మీ సమస్యలను గత ప్రభుత్వం పది సంవత్సరాలు మీ గ్రామానికి ఏం చేయలేదని నాకు అర్థం అవుతుంది కావున ఈ నాలుగేళ్లలో కచ్చితంగా మీ గ్రామాలలో రోడ్ల సమస్య డ్రైనేజీ సమస్య తదితర సమస్యలను కచ్చితంగా పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భోజరాం పటేల్ మాజీ కో ఆప్షన్ గోవింద్ మరియు శివాజీ మరియు తదితర నాయకులు మరియు మహిళలు పాల్గొన్నారు

You may also like

Leave a Comment