మిర్యాలగూడ డిసెంబర్ 17 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
డైమండ్ చెస్ అకాడమీస్
అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి మాశెట్టి దివ్యశ్రీ నేతృత్వంలో నల్గొండ జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ బ్రోచర్ ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) మంగళవారం అవిష్కరించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెస్ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించి ఎమ్మెల్యే బి.ఎల్.ఆర్. మాట్లాడుతూ ఉత్సాహవంతులైన చెస్ క్రీడాకారులు జిల్లాస్థాయి టోర్నమెంట్ లో పాల్గొని తమ ప్రతిభను చాటాలన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మా శెట్టి శ్రీనివాస్ (డైమండ్) చెస్ క్రీడాకారిణి దివ్యశ్రీ లు మాట్లాడుతూ జిల్లాస్థాయి అండర్ 19 చెస్ పోటీలు ఈనెల 22న మిర్యాలగూడ పట్టణంలోని ఐఎంఏ బిల్డింగ్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. చెస్ టోర్నమెంట్ లో పాల్గొనే వారందరికీ ఉచితంగా మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. పాల్గొనబోయే చెస్ క్రీడాకారులు 200 రూపాయలు ఎంట్రీ ఫీజు *స్కాన్* చేసి చెల్లించి, తమ తమ పేర్లు నమోదు చేసుకోనే సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. క్రీడాకారులకు సౌకర్యం కోసం.. వివరాల కొరకు 9246137777 సంప్రదించాలని వారు కోరారు.*మూడు ప్రత్యేక బహుమతులు* ఈ టోర్నమెంట్ లో పాల్గొనబోయే అండర్-7, అండర్-9, అండర్-11, అండర్- 13, అండర్-15, అండర్-17, అండర్-19, బాల, బాలికల చెస్ క్రీడాకారులకు వేరువేరుగా బహుమతులు ఇవ్వనున్నట్లు వారు పేర్కొన్నారు. చెస్ క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ (కిరాణం) ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల సైదులు ముదిరాజ్, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
