Home తాజా వార్తలు జీవన పోరాటం “గ్రూప్-2పరీక్ష”లో సతి…పిల్లల ఆలనలో పతి

జీవన పోరాటం “గ్రూప్-2పరీక్ష”లో సతి…పిల్లల ఆలనలో పతి

by Telangana Express

మిర్యాలగూడ డిసెంబర్ 16 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేతృత్వంలో గ్రూప్-2 పరీక్షలు ఆదివారం జరిగాయి సోమవారం జరుగుతున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మీనా ఇంజనీరింగ్ మహిళా కళాశాల పరీక్ష కేంద్రంలో గ్రూప్- 2 పరీక్ష రాసేందుకు చండూరు మండలానికి చెందిన నాగేంద్ర(సతి) అభ్యర్థిని తన మూడు నెలల బాబుతో వచ్చింది. పరీక్ష హాలు లోకి వెళ్లే ముందు తన మూడు నెలల బాబును పాలు తాపించి తన భర్త అన్నేపాక బాబు(పతి)కు ఇచ్చి వెళ్ళింది. పరీక్ష రాసి నాగేంద్ర వచ్చేంతవరకు మూడు నెలల బాబు ఆలన.. పాలన తండ్రి చూసుకోవడం పరీక్ష కేంద్రం ఉన్న వారందరిని ఆకట్టుకుంది. నాగేంద్ర భర్త అన్నేపాక బాబు చండూరులో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు తెలిపారు

You may also like

Leave a Comment