*భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు*
*అయ్యప్ప స్వామి నామస్మరణతో గ్రామమంతా భక్తిమయం*
లోకేశ్వరం డిసెంబర్ 15
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
లోకేశ్వరం మండలం రాజుర గ్రామంలోని హైస్కూల్ లో గురు స్వామి టి గంగాధర్, గురు స్వామి ఏ దేవా రెడ్డి, ఆధ్వర్యంలో ఆదివారం అయ్యప్ప స్వామి అష్టాదశ మహా పడిపూజ మహోత్సవాన్ని ఆర్మూర్ సుబ్బారావు గురు స్వామి వేద పండితులు వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది,స్వామియే శరణం అయ్యప్ప శరణం.. శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో గ్రామమంతా మారుమోగింది. శబరిమలై సన్నిధిని తలపించేలా ప్రత్యేక అలంకరణ చేశారు. అష్టాదశ కలశాలతో అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకం చేసి కనుల పండుగగా అయ్యప్ప మహా పడి పూజను నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 18 మెట్ల పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి మహా శివుని అయ్యప్ప, గణపతి, కుమార స్వామి విగ్రహలను ప్రతిష్టించి పూజలు చేశారు. పడి పూజకు గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన అయ్యప్ప మాలధారణ స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అయ్యప్పకు అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ గురు స్వామి సుబ్బారావు, గురు స్వామి టి గంగాధర్, గురు స్వామి, దేవా రెడ్డి, ఆయా గ్రామాల గురు స్వాములు కన్య స్వాములు గ్రామస్తులు పాల్గొన్నారు


