Home తాజా వార్తలు ఘనంగా సంతోషిమాత 19వ వార్షికోత్సవ మహోత్సవం

ఘనంగా సంతోషిమాత 19వ వార్షికోత్సవ మహోత్సవం

by Telangana Express

*ఆలయ కమిటీ ఆధ్వర్యంలో*
*భక్తిశ్రద్ధలతో సంతోషి మాత ఆలయంలో రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు*

లోకేశ్వరం డిసెంబర్ 15
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

లోకేశ్వరం మండలం బామ్నికే గ్రామంలో గత రెండు రోజులుగా వార్షికోత్సవ మహోత్సవ జాతర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవంలో భాగంగా శనివారం గంగానీళ్ళ జాతర నిర్వహించారు ఆదివారం రోజున యజ్ఞం మరియు మహా అన్నదాన ప్రసాదం కార్యక్రమానన్ని నిర్వహించారు వార్షికోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో భక్తులతో సంతోషిమాత మందిరం జన సముద్రంగా మారింది. గత 19 సంవత్సరాల నుండి గ్రామ ప్రజలు నియమ నిష్ఠలతో ఒక్కపొద్దులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు కోరిన వారి కోరికలు తీరుస్తూ భక్తులకు కొంగు బంగారంగా ఉంటూ ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపుతూ సంతోషిమాత గా బామ్ని కే గ్రామం లో వెలిసింది భక్తులు మొక్కుకున్న కోరికలను తీర్చుకున్నారు పిల్లలను బంగారు ఆభరణాలు మరియు బెల్లం తో తూకం వేసి మొక్కులను తీర్చుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment