Home తాజా వార్తలు శ్రీ సద్గురు బండయ్యప్ప స్వామి పుణ్యతిథి మహోత్సవం….

శ్రీ సద్గురు బండయ్యప్ప స్వామి పుణ్యతిథి మహోత్సవం….

by Telangana Express

మహా అన్నదాన ప్రసాదం…

శ్రీ సద్గురు సోమలింగ స్వామీజీ ఆధ్వర్యంలో భక్తి కార్యక్రమాలు….

బిచ్కుంద డిసెంబర్ 15:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా
బిచ్కుంద మండల కేంద్రంలోని శ్రీ సద్గురు బసవలింగప్ప స్వామి సంస్థాన్ మఠము లో ఆదివారం రోజున శ్రీ సద్గురు బండ అయ్యప్ప స్వామి పుణ్యతిథి మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సుప్రభాతం,ధ్వజ ఆరోహణ ,అనంతరం వేద విద్యార్థులతో వైదిక మంత్రాలచే శ్రీ సద్గురు బండయ్యప్ప స్వామి వారి సమాధికి రుద్రాభిషేకం, లక్ష బిల్వర్చన మరియు మహా మంగళ హారతి నిర్వహించారు.అనంతరం స్వాములతో ప్రవచనాలు నిర్వహించారు . తీర్థ ప్రసాదములు మరియు స్వామివారి దర్శనము తదితర కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.అనంతరం భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేసినారు .సద్గురు బండ అయ్యప్ప స్వామి పుణ్యతిథి కి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి పెద్ద మొత్తంలో భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీర్వాదం ,తీర్థ ప్రసాదం స్వీకరించినారు.

You may also like

Leave a Comment