Home తాజా వార్తలు దత్త జయంతి వేడుకలకుహాజరైన మాజీ ఎమ్మెల్యే సురేందర్….

దత్త జయంతి వేడుకలకుహాజరైన మాజీ ఎమ్మెల్యే సురేందర్….

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 15,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణ శివారులో గల దత్తగిరి ఆశ్రమంలో, ఆదివారం దత్త జయంతి వేడుకలను పురస్కరించుకొని మాణిక్యం మహారాజ్ కుటుంబీకులు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. పూజ కార్యక్రమానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరైయ్యారు. పూజారి శ్రీనివాస జోషి పంతులు ఎమ్మెల్యేచే ప్రత్యేక పూజలు చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడవాలని అన్నారు. అంతేకాకుండా దత్తగిరి ఆశ్రమంలో ఆలయ నిర్మాణానికి ఇటీవల భూమి పూజను చేయడం శుభ పరిణామం అని అన్నారు. రానున్న రోజుల్లో దత్తగిరి ఆశ్రమం మరింత అభివృద్ది చెందాలని దానికి భక్తులతో పాటు ప్రజలు సహాయ సహకారాలు ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం పూజారులు శ్రీనివాస్ జోషి పంతులు, బద్రి పంతులు మాజీ ఎమ్మెల్యేను వేదమంత్రాలతో ఆశీర్వ దించారు. పిదప ఆశ్రమ నిర్వాహకులు తులసీదాస్ తదితరులు మాజీ ఎమ్మెల్యే కు శాలువాను కప్పి ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వెంట బిఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు జెలంధర్ రెడ్డి, అదిమూలం సతీష్ కుమార్, ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఎగుల నర్సింలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఎరుకల సాయిలు, భుంగారి రాము, నాయకులు శ్రీనివాస్ నాయక్ , మాజీ సర్పంచ్ రఘువీర్ గౌడ్, శ్రవణ్ కుమార్, ఇమ్రాన్ సాజిద్, గంగారెడ్డి, బర్కత్, నాగం సురేందర్, నాగరాజు, రవి, మనోజ్ , కృష్ణ రెడ్డి , దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment