మిర్యాలగూడ డిసెంబర్ 15 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ లో ఈనెల 16 ఉదయం 6 గంటలకు ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నవీన్ ఇంటి వద్ద గోత్రనామాలచే పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో భారీ సంఖ్యలో స్వాములు పాల్గొనున్నారని తెలిపారు అభిషేకాలు కేరళ సాంప్రదాయ వాయిద్యములతో ఊరేగింపుగా గుడిపాటి నవీన్ ఇంటి వద్ద నుండి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు కలశ ప్రదర్శన నిర్వహించినట్లు తెలిపారు. ఈనెల 16 (సోమవారం) ఉదయం 9 గంటల నుండి స్వాములచే దీపారాధన నవాభిషేకములు మెట్ల పూజ తీర్థ ప్రసాద వినియోగాలు ఉంటాయని తెలిపారు.ఒంటిగంట నుండి స్వామివారి మహా ప్రసాద అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తామని, అనంతరం సాయంత్రం 5 గంటలకు
కేరళ సాంప్రదాయ పంచ వాయిద్యములచే భక్తుల భగవన్నామస్మరణలతో మిర్యాలగూడ పట్టణ ప్రధాన కాలనీలలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
