Home తాజా వార్తలు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి…విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధించాలి…- జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వి.విక్టర్

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి…విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధించాలి…- జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వి.విక్టర్

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వి.విక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కామన్ మెను డైట్ ప్రోగ్రాంను, శనివారం పట్టణంలోని సాంఘిక సంక్షేమ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న భోజనం తయారీని పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కామన్ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. విద్యార్థులకు పెరిగిన మెస్ చార్జీలకు అనుగుణంగా భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఆతర్వాత ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ… విద్యార్థులు ఉన్నత లక్ష్యంను నిర్దేధించుకుని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా రాణించాలని సూచించారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదని వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహిం చాలని సూచించారు. అనంతరం ఆర్డిఓ మన్నే ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులకు అనుకూలంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని విద్య పట్ల మక్కువతో విద్యార్థులు తమ నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవాలని కోరారు. విద్య తోనే అన్ని సాధ్యమ వుతాయని, విద్యార్థి దశ నుంచి కష్టపడి విద్యనభ్యసిస్తే ఉన్న శిఖరాలను చేరుకునేందుకు సులువైన మార్గం ఏర్పడుతుందని అన్నారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. పిదప అదనపు కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహా పంక్తి భోజనం చేసి, భోజనం నాణ్యతగా రుచికరంగా ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తో పాటు, ఆర్డీఓ, తహసీల్దార్ అల్లం మహేందర్ కుమార్, గిర్డావర్ శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపల్ మహ్మద్ రఫత్, ఉపాద్యాయులు దత్తాత్రేయ, సంతోష్, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment