కినికర్ మహారాజ్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాదం…
బిచ్కుంద డిసెంబర్ 14:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా
బిచ్కుంద మండల కేంద్రంలో ఉన్న దత్తాత్రేయ మందిరం లో శనివారం ఉదయం నుండి దేవదత్ కినికర్ మహారాజ్ ఆధ్వర్యంలో దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగినాయి.
మృగశిర నక్షత్రంలో కూడిన పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి అవతరించారు. దత్తాత్రేయ రూపం బహు చిత్రం తత్వం అతి విచిత్రం అనుగ్రహం అత్యంత ఆశ్చర్యకరం లీలలు అద్భుతం.
మార్గశిర పౌర్ణమి నాడు దత్త జయంతి జరుపుకుంటాం.
ఉదయము నుండి ప్రవచనము, భజన, కీర్తన కార్యక్రమము జరిపించి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా దత్తాత్రేయ భగవాన్ కి ఉయ్యాలలో ప్రతిష్టాపించి జోల పాటలతో దేవుని నామ స్మరణముతో ఆలయ ప్రాంగణంలో మారుమోగింది.
ఈ సందర్భంగా కినికర్ మహారాజ్ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి భక్తి మార్గంలో నడవాలని అలాగే దత్తాత్రేయ భగవానుని నమ్మిన ప్రతిభక్తునికి మంచి జరుగుతుందని తెలిపారు.
ప్రతి భక్తుడు దత్తాత్రేయ జయంతి నాడు దేవుని దర్శించుకుంటే పుణ్యఫలము వస్తుందని తెలిపారు. అనంతరం మహా అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేసినారు. ఈ ఉత్సవాలకు మహారాష్ట్ర,కర్ణాటక చెందిన భక్తులే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించి ఆశీర్వాదం పొందినారు.

