కోరుట్ల, డిసెంబర్ 14(తెలంగాణ ఎక్స్ ప్రెస్) పట్టణంలో శుక్రవారం రాత్రి హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా కొవ్వొత్తులు నిరసన తెలిపారు. దాడులలో చనిపోయిన వారికి కొవ్వొత్తులతో నివాళలు అర్పించి మౌనం పాటించారు ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో మాడవెణి నరేష్ ,చిరుమళ్ళ ధనంజయ్ ,గజం రాజ్,శెట్టిపల్లి శంకర్,సంకు సుధాకర్,
పోతుగంటి శ్రీనివాస్,బింగి వెంకటేష్,అమర్,రుద్ర శ్రీనివాస్
ఇందూరు సత్యం, రాచమడుగు శ్రీనివాస్,మాసం ప్రసాద్,ఆంజనేయులు
కలల సాయి చందు, దమ్మ సంతోష్,గోనెల రాజశేఖర్
భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలు తదితరులు పాల్గొన్నారు.
