తెలంగాణ ఎక్స్ ప్రెస్ 14/12/24
భైంసా పట్టణం లోని గా అన్ కళాశాల లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త మార్పు డి మెనూ ఆవిష్కరణలో భాగంగా భైంసా పట్టణంలోని మైనారిటీ బాలుర పాఠశాల మరియు కళాశాలలో జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏ ఏస్ పీఅవినాష్ సి ఐ గోపినాథ్ మండల పరిషత్ సుధాకర్ రెడ్డి , మున్సిపల్ వార్డు సభ్యులు ఫైజుల్ల ఖాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అతిధులు ప్రసంగిస్తూ డి ఎట్ మెనూ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వం డి ఎట్ మార్పులను నలబై శాతం పెంపు, కాస్మోటిక్ చార్జీలు రెండు వందల శాతంకి పెంచటం జరిగిందని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత చదువుల్లో రాణించాలని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎమ్ ఏ . జబ్బార్ వైస్ ప్రిన్సిపల్ సాయినాథ్ గంధం కళాశాల మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఏ ఎస్పీ పి అవినాష్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక గణిత తరగతిని తీసుకున్నారు.
