తెలంగాణ ఎక్స్ ప్రెస్ 14/12/24
భైంసా మండలము కేంద్రం లోని
దేగామ్ గ్రామం లోని
పేదోడి చెంతకు వెళ్లి ఓదార్పు
*కాలి నడకన ఇంటిటా తిరుగుతూ పలకరింపు*
ప్రభుత్వ పరంగా ఆదుకుంటానని భరోసా
గత రెండు నెలల నుండి భైంసా మండలంలోని దేగాం గ్రామంలో వేర్వేరు కారణాలతో పదిమందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడడం, వేర్వేరు కారణాలతో పలువురు మృతి చెందడంతో 12 మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. అన్ని పేద కుటుంబాలు కావడంతో ఇంటింటికి వెళ్లి వారిలో మనోధైర్యాన్ని నింపి, నేనున్నానని భరోసా కల్పించారు. ఆత్మహత్యలకు కారణాలేంటో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వపరంగా ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఆయన తెలిపారు. గ్రామంలో ఆయన కాలినడక బాట పట్టి తిరిగారు. పేద కుటుంబాలకు పరామర్శించి, భరోసా కల్పించడం పట్ల గ్రామానికి చెందిన బిజెపి నాయకులు ఎమ్మెల్యే పటేల్ కు కృతజ్ఞతలు తెలిపారు. పేద కుటుంబాలకు ఎమ్మెల్యే పటేల్ తన వంతుగా సహాయాన్ని అందించారు. పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే వెంట బిజెపి నియోజకవర్గ నాయకులు సొలంకి భీంరావ్, కుంటాల మండల నాయకులు వెంగల్ రావ్, స్థానిక నాయకురాలు బిజెపి జిల్లా సభ్యత్వ నమోదు కో ఆర్డినేటర్ సిరం సుష్మ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఎల్లప్ప, నాయకులు కిష్టన్న, చంద్రకాంత్ పటేల్, భోజరాం పటేల్, పోల్కం సాయి, రాము, గంగాధర్, గణపతి, పోతయ్య, రవి,గంగారాం,శారదా,తదితరులు పాల్గొన్నారు..
