ముధోల్: 13డిసెంబర్ (తెలం గాణ ఎక్స్ ప్రెస్)
మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంగా పని చేస్తోంది.దీనికి నిదర్శనమే మండలంలోని రాంటేక్ గ్రామంలో పలు ఇళ్లకు ఇచ్చిన విద్యుత్ కనెక్షన్లు. వంగి ఉన్న విద్యుత్ స్థంభం నుండి కొండిలుగా వేసి మీటర్ లకు కనెక్షన్ లు ఇచ్చారు. గత ఎన్నో రోజులుగా స్థంభం ఇలానే ఉన్న ఇక్కడ విధులు నిర్వహించే లైన్ మెన్ చూసి చూడనట్టుగా ఉంటాడని గ్రామస్తులు వాపోతున్నారు. ఇలా నిర్లక్ష్యంతో విధులు నిర్వహిస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్టే. అంతే కాకుండా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కల తీగలు ఒక వలయంలా ఏర్పడి ఆ ట్రాన్స్ ఫార్మర్ కనబడని పరిస్థితిలో ఉంది.ట్రాన్స్ ఫార్మర్ గద్దె సైతం కూలే దశలో ఉంది.ఎవరైనాఅనుకోకుండా ట్రాన్స్ ఫార్మర్ పరిసర ప్రాంతాల వద్దకు వెళ్తే వారి ప్రాణాలకు ముప్పే. ఇదే విషయం మండల ఏఈ శ్రీకాంత్ ను అడగగా ప్రదేశానికి వెళ్లి చూసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

